లాక్‌డౌన్ కారణంగా ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగా ఇండియన్ నేవీ సముద్ర సేతు ఆపరేషన్‌ను చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వారిని జలమార్గ ద్వారా భారత్‌కు తిరిగి తీసుకురానున్నది. ఐఎన్‌ఎస్ జలాశ్వ, ఐఎన్‌ఎస్ మగర్ మాల్దీవులకు బయల్దేరాయి. ఫేజ్-1 లో భాగంగా ఈ నెల 8వ తేదీన మాల్దీవుల నుంచి వెయ్యి మంది భారతీయులను భారత్‌కు తీసుకురానున్నాయి. వీరందరిక వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రయాణానికి అనుమతించనున్నారు.
'సముద్ర సేతు' ను ప్రారంభించిన ఇండియన్ నేవీ