టైటానిక్ కెప్టెన్‌లా.. కేంద్ర‌ ఆరోగ్య‌మంత్రి

క‌రోనా వైర‌స్‌ను నియంత్రిస్తున్నామ‌ని ఇవాళ కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ లోక్‌స‌భ‌లో వెల్ల‌డించారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.  వైర‌స్ నియంత్ర‌ణ‌లో ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి వెల్ల‌డించిన‌ తీరును రాహుల్ త‌ప్పుప‌ట్టారు.  టైటానిక్ నౌక మునుగుతున్న స‌మ‌యంలో.. ఆందోళ‌న చెంద‌వ‌ద్దు అంటూ ప్ర‌యాణికుల‌కు కెప్టెన్ సూచిస్తున్న త‌ర‌హాలో మంత్రి వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని రాహుల్ విమ‌ర్శించారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించాల‌న్నారు.  సంక్షోభాన్ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవాల‌న్నారు.